మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ లీడ్రోల్ పోషించిన మలయాళ చిత్రం ‘మార్కో’. హనీఫ్ అదేని దర్శకత్వంలో షరీఫ్ ముహమ్మద్ నిర్మించిన ఈ చిత్రాన్ని అదే పేరుతో ఎన్వీఆర్ సినిమా తెలుగులో జనవరి 1న విడుదల చేస్తున్నది. ఈ సందర్భంగా రిలీజ్ డేట్ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు. రక్తపు మరకలతో సీరియస్గా చూస్తున్న ఉన్ని ముకుందన్ని ఈ పోస్టర్లో చూడొచ్చు. కేరళలో అఖండ విజయాన్ని సాధించిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు కూడా నచ్చుతుందని మేకర్స్ చెబుతున్నారు. యుక్తి తరేజా, కబీర్ దుహన్సింగ్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: చంద్రు సెల్వరాజ్, సంగీతం: రవి బస్రూర్, నిర్మాణం: క్యూబ్స్ ఎంటైర్టెన్మెంట్స్.