Marco 2 Shelved | మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ ప్రధాన పాత్రల్లో వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్న చిత్రం మార్కో. గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ చిత్రం కేరళాలో బ్లాక్ బస్టర్ అందుకోవడమే కాకుండా సినిమాలో హింస(Violence) ఎక్కువగా ఉండడం వలన విమర్శలను కూడా అందుకోంది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ రాబోతున్నట్లు మలయాళం మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మూవీపై ఉన్న బజ్ కారణంగా.. సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఈ వార్తలపై తాజాగా క్లారిటీ ఇచ్చాడు ఉన్ని ముకుందన్. ఈ సినిమాకు వచ్చిన నెగిటివిటీ కారణంగా సీక్వెల్‌ను రద్దు చేస్తున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించాడు.
ఒక అభిమాని ‘మార్కో 2’ గురించి అడగ్గా.. ఉన్ని ముకుందన్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ విషయంపై స్పందిస్తూ.. “క్షమించండి సోదరా, నేను మార్కో సిరీస్‌ను కొనసాగించే ఆలోచనలను విరమించుకున్నాను. ఈ సినిమాపై వచ్చిన నెగిటివిటే దానికి కారణం. మార్కో కంటే పెద్దది.. మర్కో కంటే పెద్ద ప్రాజెక్ట్‌ను తీసుకురావడానికి నావంతు కృషి చేస్తాను. అంటూ ఉన్ని చెప్పుకోచ్చాడు.