చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించిన ముంబై భామ అవికాగోర్ (Avika Gor) ఉయ్యాలా జంపాలా సినిమాతో తెలుగులో హీరోయిన్గా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఈ భామ హీరోయిన్గా నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి ఉమాపతి (Umapathi). అనురాగ్ హీరోగా నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ షేర్ చేశారు మేకర్స్.
ఈ చిత్రం నుంచి బుట్ట ఫస్ట్ సాంగ్ లిరికల్ వీడియోను జనవరి 7న లాంఛ్ చేయనున్నట్టు తెలియజేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ స్పెషల్ పోస్టర్ కూడా విడుదల చేశారు. లంగావోణి లుక్‌లో ఉన్న అవికాగోర్ ప్రియుడితో కలిసి పచ్చని పంట పొలాల మధ్యనున్న దారిలో నడుచుకుంటూ సరదాగా షికారు చేస్తోంది. పాట ఎలా ఉండబోతుందో హింట్ ఇస్తూ రిలీజ్ చేసిన ఈ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సత్య ద్వారపూడి డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని కృషి క్రియేషన్స్ అవికా స్క్రీన్ క్రియేషన్స్ బ్యానర్లపై కే కోటేశ్వర్ రావు నిర్మిస్తున్నారు. అవికా గోర్ ఈ సంవత్సరం 1920.. Horrors Of The Heart సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.
లంగావోణి లుక్‌లో అవికాగోర్..
The 1st Single #Butta ,a breezy melody, from the youthful romantic entertainer #Umapathi will be out on 7th Jan#Anuragh, @avika_n_joy #KKoteswarRao #SatyaDwarapudi #Raghavendra #ShakthiKanthKarthick #GouthamRaju #KrishiCreations #AvikaScreenCreations@PROSaiSatish pic.twitter.com/S8KaOrFDjJ
— Vamsi Kaka (@vamsikaka) January 6, 2023