అనురాగ్, అవికా గోర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఉమాపతి’. క్రిషి క్రియేషన్స్ పతాకంపై సత్యం ద్వారంపూడి దర్శకత్వంలో కె.కోటేశ్వరరావు నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు. అందమైన గ్రామీణ నేపథ్యంలో టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది. రెండు గ్రామాల మధ్య గొడవలు నాయకానాయికల ప్రేమకు అడ్డుగోడలా నిలిచే సన్నివేశాలతో టీజర్ ఆసక్తికరంగా సాగింది.
కుటుంబ సమేతంగా చూడాల్సిన చిత్రమిదని, సహజత్వం ఉట్టిపడే గ్రామీణ ప్రేమకథగా ప్రతి ఒక్కరిని అలరిస్తుందని దర్శకుడు తెలిపారు. పోసాని కృష్ణమురళి, తులసి, ప్రవీణ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రాఘవేంద్ర, సంగీతం: శక్తికాంత్ కార్తిక్, దర్శకత్వం: సత్యం ద్వారపూడి.