స్వీయ నిర్మాణ దర్శకత్వంలో జనం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సత్యారెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఉక్కు సత్యాగ్రహం’. దివంగత గద్దర్, ‘పల్సర్ బైక్’ ఝాన్సీ, ఎపీ ఎమ్మెల్యే ధర్మశ్రీ తదితరులు ముఖ్యపాత్రలను పోషించారు. గురువారం ట్రైలర్ను దర్శకుడు త్రినాథ రావు నక్కిన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దర్శకనిర్మాత సత్యారెడ్డి చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఈ సినిమాను రూపొందించాను. గద్దర్గారు నాకు తండ్రితో సమానం. ఆయన ఈ రోజు మన మధ్యన లేకపోవడం బాధాకరం. విశాఖ ఉక్కు ఉద్యమ సమస్యలను తెలియజేస్తూ ఈ సినిమా తీశాం. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే స్ఫూర్తివంతమైన చిత్రమిది’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రీకోటి, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: పి.సత్యారెడ్డి.