UITheMovie | తెలుగులో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న కన్నడ స్టార్ హీరోల్లో టాప్‌లో ఉంటాడు ఉపేంద్ర (Upendra). విలక్షణ నటనకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఉపేంద్రకు కన్నడనాట ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే షాకవ్వాల్సిందే. కబ్జ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్‌పై కన్నేసిన ఈ స్టార్ యాక్టర్ తాజాగా ‘UI’ (UITheMovie) సినిమా చేస్తున్నాడు. లాంగ్ గ్యాప్ తర్వాత స్వీయదర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో అభిమానుల ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు.
టీజర్ ఎప్పుడెప్పుడొస్తుందా..? అని చూస్తున్న అభిమానుల కోసం అప్డేట్ ఇచ్చేశాడు ఉపేంద్ర. అభిమానులంతా ఉపేంద్ర ఇంటి దగ్గరకొచ్చి.. కొత్త సినిమా టీజర్, ట్రైలర్ ఇతర అప్డేట్స్ కావాలంటూ స్లోగన్స్ చేస్తుంటే.. ఉపేంద్ర బయటకు వచ్చి సెప్టెంబర్ 18న టీజర్ వస్తుందని క్లారిటీ ఇచ్చాడు. కథల ఎంపికలో, యాక్టింగ్‌లో, డైరెక్షన్లో తనదైన మార్క్ చూపించే ఉపేంద్ర ఈ సారి ఎలాంటి మూవీతో రాబోతున్నాడన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది.
మనోహరన్- శ్రీకాంత్ కేపి సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రీష్మా నానయ్య ఉపేంద్రతో రొమాన్స్ చేయబోతుంది. కాంతార ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఉపేంద్ర కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేసిన టీజర్ అనౌన్స్ మెంట్ వీడియో ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. లహరి ఫిలిమ్స్, వీనస్ ఎంటర్టైనర్స్ సంయుక్త నిర్మాణంలో వస్తున్న ఈ మూవీకి సంబంధించిన బీటీఎస్ వీడియో ఒకటి ఇప్పటికే నెట్టింట హల్ చల్ చేస్తోంది.
UITheMovie టీజర్ అప్డేట్..
#UITheMovie‘s Update Of Teaser YT Links:
Kannada: https://t.co/dkf2O82BFF
Hindi: https://t.co/eMDz93GiM6
Telugu: https://t.co/x6fAzlSnAE
Tamil: https://t.co/CaF26WcIOo
Malayalam: https://t.co/6AVJysu2jF#UppiDirects @nimmaupendra @LahariFilm #GManoharan @enterrtainers… pic.twitter.com/fcMNjoque4
— Upendra (@nimmaupendra) September 11, 2023
UITheMovie బీటీఎస్ వీడియో..