UI The Movie | కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర (Upendra) కాంపౌండ్ నుంచి వస్తోన్న పాన్ ఇండియా చిత్రం ‘యూఐ’ (UI The Movie). ఉపేంద్ర కథనందిస్తూ.. డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని మనోహరన్-శ్రీకాంత్ కేపి సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. రీష్మా నానయ్య ఫీ మేల్ లీడ్ రోల్లో నటి పోషిస్తోంది. ఈ చిత్రానికి కాంతార ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
మేకర్స్ తాజాగా మూవీ రిలీజ్ డేట్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. పోనీ టెయిల్‌తో స్టైలిష్ గాగుల్స్ పెట్టుకున్న ఉపేంద్ర చేతిలో గన్ పట్టుకోగా.. బ్యాక్ డ్రాప్లో హెలికాప్టర్లు గమనించవచ్చు. ఈ చిత్రాన్ని కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.
ఇప్పటికే లాంచ్ చేసిన సౌండ్ ఆఫ్ యూఐ (Sound Of Ui) ఎలాంటి థీమ్‌తో ఉండబోతుందో హింట్ ఇచ్చేసింది. ఉపేంద్ర అశ్వంపై యుద్దవీరుడిలా కనిపిస్తున్న లుక్‌తోపాటు మేకింగ్‌లో హిస్టరీ. సినిమాను మరోసారి పునర్నిర్వచించేందుకు ఉపేంద్ర ఈ అక్టోబర్‌లో కీర్తి మార్గంలో రాబోతున్నాడంటూ మేకర్స్ షేర్ చేసిన అప్డేట్ ఇప్పటికే సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తుంది.
యూఐ అనౌన్స్మెంట్ వీడియోతో ఉపేంద్ర ఈ సారి పాన్ ఇండియా బాక్సాఫీస్‌పై దండయాత్ర చేయాలని గట్టిగానే ఫిక్సయినట్టు చెప్పకనే చెబుతున్నాడు. ఈ చిత్రాన్ని లహరి ఫిలిమ్స్, వీనస్ ఎంటర్టైనర్స్ సంయుక్త నిర్మాణంలో తెరకెక్కిస్తున్నారు.
.@nimmaupendra
#Upendra‘s #UiTheMovie releasing on Dec 20,2024 pic.twitter.com/etGbBRFAz8— BA Raju’s Team (@baraju_SuperHit) October 14, 2024
Lokesh Kanakaraj | లియోలో తప్పులు.. దర్శకుడు లోకేష్ కనకరాజ్‌పై విజయ్ తండ్రి ఫైర్