నందు, అవికా గోర్ జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘అగ్లీ స్టోరీ’. ప్రణవ స్వరూప్ దర్శకుడు. సుభాషిణి, కొండా లక్ష్మణ్ నిర్మాతలు. ప్రస్తుతం సినిమా నిర్మాణ దశలో ఉంది. నిర్మాతలు మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. అందులో భాగంగా ఈ సినిమాలో ‘హే ప్రియతమా..’ అంటూ సాగే గీతాన్ని మేకర్స్ విడుదల చేశారు. భాస్కరభట్ల రవికుమార్ రాసిన ఈ పాటను శ్రవణ్ భరద్వాజ్ స్వరపరిచారు.
కాలభైరవ ఆలపించారు. యువతరానికి కనెక్టయ్యేలా ఈ పాట సాహిత్యం, సంగీతం, చిత్రీకరణ సాగింది. నందు, అవికా గోర్ల కెమిస్ట్రీ, శ్రీసాయికుమార్ విజువల్స్ ఈ పాటకు ప్రధాన ఆకర్షణలు. శివాజీరాజా, రవితేజ మహాదాసం, ప్రజ్ఞ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈచిత్రానికి నిర్మాణం: రియా జియా.