Pawan Kalyan | పవన్ కల్యాణ్ పుట్టినరోజు జరిపేందుకు అభిమానులు రెడీ అవుతున్నారు. సెప్టెంబర్ 2న పవన్ కల్యాణ్ (Pawan Kalyan) బర్త్ డే సందర్భంగా పవర్ స్టార్ కెరీర్లో స్పెషల్ సినిమాగా నిలిచిన గుడుంబా శంకర్ (Gudumba Shankar)ను రీరిలీజ్ చేస్తున్నారని తెలిసిందే. ఈ చిత్రం ఆగస్టు 31, సెప్టెంబర్ 1న రీరిలీజ్ కాబోతుందని నాగబాబు వెల్లడించారు.
కాగా ఇప్పుడు పవన్ కల్యాణ్ అభిమానుల్లో మరింత జోష్ నింపే మరో అప్డేట్ ఒకటి హల్ చల్ చేస్తోంది. సరైన హిట్స్ లేని పవన్ కల్యాణ్ కెరీర్‌ను మలుపు తిప్పిన చిత్రం గబ్బర్ సింగ్. హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచి.. నిర్మాతకు కాసుల పంట పండించింది. గబ్బర్ సింగ్ (Gabbar Singh) సినిమా కూడా రీరిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ విషయాన్ని నిర్మాత బండ్ల గణేశ్ తెలియజేశారు. ఈ లెక్కన పవన్ కల్యాణ్ బర్త్ డేన ఒకేసారి రెండు సినిమాలు విడులవుతాయా..? అనేది చూడాలంటున్నారు ఫ్యాన్స్.
గుడుంబా శంకర్ రీరిలీజ్ ద్వారా వచ్చిన మొత్తాన్ని జనసేన పార్టీకి విరాళంగా అందించనున్నారని ఇన్సైడ్ టాక్. రీసెంట్గా జల్సా, ఆరెంజ్ రీరిలీజ్‌కు వచ్చిన కలెక్షన్లను జనసేనకు విరాళంగా అందించిన విషయం తెలిసిందే.