థియేటర్స్‌లోకి రాబోతున్న మరో రెండు సినిమాలు

కరోనా సెకండ్ వేవ్ వలన మూతపడ్డ థియేటర్స్ తిరిగి తెరచుకున్న విషయం తెలిసిందే. జూలై 30 నుండి థియేటర్స్ లో సందడి మొదలైంది. వినాయక చవితి నుండి పెద్ద సినిమాల జాతర మొదలుకానుండడంతో చిన్న సినిమాల నిర్మాతలు తమ సినిమా రిలీజ్ డేట్స్‌ని ప్రకటిస్తున్నారు. పాగల్, క్రేజీ అంకుల్ వంటి చిత్రాలు ఇటీవల రిలీజ్ డేట్ ప్రకటించగా, ఇప్పుడు సుశాంత్, అవసరాల శ్రీనివాస్ తమ సినిమాల రిలీజ్ డేట్స్ ప్రకటించారు.
థియేటర్స్‌కి ప్రేక్షకులు వస్తున్న నేపథ్యంలో అందరు నిర్మాతలు ఓటీటీకి నో చెప్పి థియేటర్స్ లోనే సినిమాలు విడుదల చేస్తున్నారు. అక్కినేని ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి పరిచయం అయిన సుశాంత్ “ఇచట వాహనములు నిలుపరాదు” అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే. దర్శకుడు ఎస్ దర్శన్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఆగష్టు 27న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రంలో సుశాంత్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించగా ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించాడు.
ఇక అవసరాల శ్రీనివాస్ మరియు రుహని శర్మ లు హీరో హీరోయిన్ లుగా కలిసి నటిస్తున్న తాజా చిత్రం నూటొక్క జిల్లాల అందగాడు. రాచకొండ విద్యా సాగర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని దిల్ రాజు మరియు క్రిష్ జాగర్లమూడి సమర్పణ లో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ మరియు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని శిరీష్ నిర్మిస్తున్నారు.ఆగస్ట్ 27న చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
కమీషన్ల కోసమే కొడంగల్-పేట ఎత్తిపోతలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

