టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరోయిన్ సమంత (Samantha) డైలీ టైం టేబుల్లో వర్కవుట్ సెషన్ తప్పకుండా ఉండాల్సిందే. పర్ఫెక్ట్ ఫిట్ నెస్ మెయింటైన్ చేస్తూ ఎందరో ఫిట్ నెస్ లవర్లకు స్పూర్తిగా నిలుస్తుంది. ఈ బ్యూటీ జిమ్ వర్కవుట్స్ చేసి చెమటోడుస్తుండగా..సామ్ స్నేహితులు వచ్చి డిస్టర్బ్ చేశాయి. రెండు పెంపుడు కుక్కలు శషా, హష్ జిమ్‌లో వర్కవుట్ చేస్తున్నపుడు సమంత దగ్గరకు వచ్చి..జిమ్ సెషన్ (gym workout )కు బ్రేకులు వేశాయి.
వర్కవుట్ టైంలో శునకాలు సమంతకు దగ్గరగా రావడం ఇదికొత్తేమీ కాదు. సామ్ సోషల్ మీడియా ఫీడ్ చాలా మందికి స్పూర్తి కలిగించేంత గొప్పగా ఉంటుంది. ఇప్పటికే ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్లో మోటివేషనల్ వీడియో పోస్ట్ చేసింది సమంత. మరోవైపు నయనతార-విజయ్ సేతుపతితో కలసి కాతువాకుల రెండు కాధల్ సినిమా చేస్తోంది.
దీంతోపాటు ఫీ మేల్ ఓరియెంటెడ్ ప్రాజెక్టు యశోదతో ఫుల్ బిజీగా ఉంది. హాలీవుడ్ ప్రాజెక్టు రీమేక్‌లో కూడా నటిస్తోంది. గుణశేఖర్ డైరెక్షన్లో నటిస్తున్న శాకుంతలం షూటింగ్ పూర్తి చేసుకుంది.