Disha Patani | ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో బాలీవుడ్ నటి దిశా పటానీ ఇంటి వద్ద కాల్పుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఢిల్లీ పోలీసులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. కాల్పులకు పాల్పడిన వారు ఎక్కడ ఉన్న పట్టుకుని తీరుతామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హామీ ఇచ్చిన మరుసటి రోజే ఈ ఘటన జరగడం గమనార్హం.
ఢిల్లీ శివారు ఘజియాబాద్ ట్రోనికా సిటీలో ఇద్దరు నిందితులు రవీంద్ర, అరుణ్‌ను ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్, ఢిల్లీ పోలీసులు గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకునే క్రమంలో ఎదురుకాల్పులు జరిగాయి. కాల్పుల్లో నిందితులకు తీవ్ర గాయాలు కావడంతో.. ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు నిందితులు ప్రాణాలు విడిచారు. ఘటనాస్థలి నుంచి తుపాకులు, పెద్ద మొత్తంలో బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.