గురువారం 29 అక్టోబర్ 2020
Cinema - Sep 26, 2020 , 08:41:00

టీవీ షోనే బాలు ప్రాణం తీసిందా ?

టీవీ షోనే బాలు ప్రాణం తీసిందా ?

గాన గంధ‌ర్వుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం తిరిగి రాని లోకాల‌కు వెళ్ళారు. ఆయ‌న మ‌ర‌ణంతో సంగీత ప్ర‌పంచం మూగ‌బోయింది. రాగం, తానం, పల్ల‌వి విషాదంలో మునిగాయి. సంగీతం ప్రపంచం అంతా చింతిస్తోంది. ఆయ‌న మ‌ర‌ణం సంగీత ప్రియుల‌కు ఓ పీడ‌క‌ల‌గా మారింది. అయితే క‌రోనా స‌మ‌యంలో బాలు టీవీ షోకు హాజ‌రు కావ‌డ‌మే ఆయ‌న ప్రాణానికి ముప్పుగా మారింద‌ని చెబుతున్నారు.

క‌రోనా విజృంభిస్తున్న‌ స‌మ‌యంలో పెద్ద వ‌య‌స్సు ఉన్న వారు బ‌య‌ట‌కు రావొద్దని ప్ర‌భుత్వాలు, వైద్యులు ఎంత‌గానో హెచ్చ‌రించారు. అయితే ఓ టీవీ షో నిర్వాహ‌కులు బాలుని కాస్త ఫోర్స్ చేయ‌డంతో జులై 30 న ఆయన "సామజవరగమనా" అనే టీవీ షోకు  అటెండ్ అయిన‌ట్టు తెలుస్తుంది. ఆ షోలో అటెండ్ అయిన చాలా మందికి  పాజిటివ్ వచ్చింది . మిగతా వారికి కరోనా తగ్గింది. కానీ బాలూ వయసులో పెద్దవారు కావ‌డంతో ఆయ‌నపై తీవ్ర ప్ర‌భావం చూపింది. క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ఆయ‌న ఆరోగ్యం పూర్తిగా క్షీణించ‌డంతో శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం బాలు క‌న్నుమూశారు 


logo