Tumbbad Movie | కొన్ని సినిమాలను మాటల్లో వర్ణించడానికి పదాలు చాలవు. డిక్షనరి కొనుక్కొని కొత్త కొత్త పదాలను వెతుక్కోవాల్సి ఉంటుంది. అలా మాటల్లో చెప్పలేని సినిమాల్లో ‘తుంబాడ్’ (Tumbbad) ఒకటి. మైథలాజికల్ హారర్ బ్యానర్లో వచ్చిన ఈ మూవీకి రాహి అనిల్ బార్వే, ఆనంద్ గాంధీ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. ఇక 2018లో చిన్న సినిమాగా విడుదలైన ‘తుంబాడ్’ బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద హిట్టు కొట్టడమే కాకుండా, రివ్యూల పరంగానూ మెప్పు పొందింది.
ఈ సినిమాకు వచ్చిన ఆధరణతో అన్ని భాషల ప్రేక్షకుల నుండి భారీ డిమాండ్ ఏర్పడింది. దాంతో మేకర్స్ పలు భాషల్లోకి డబ్ చేసి రిలీజ్ చేశారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయగా.. ఇక రిలీజైన ప్రతి భాషలో కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఇక లాక్ డౌన్ టైంలో ఓటీటీలో వచ్చి అక్కడ కూడా రేటింగ్స్ పరంగా మంచి రికార్డ్ నమోదు చేసింది ఈ సినిమా.
స్వాతంత్ర్యంకు ముందు మహారాష్ట్రలోని తుంబాడ్ అనే గ్రామంలో దాగి ఉన్న నిధి గురించి సాగే అన్వేషణతో ఈ కథ ఉంటుంది. అత్యాశ మనిషికి ఎలాంటి పరిస్థితికి దిగజారుస్తుందో సినిమాలో చక్కగా చూపించారు. ఇక ఈ సినిమా షూటింగ్‌ను ఆరేళ్ల పాటు తెరకెక్కించగా.. అనేక సన్నివేశాలను రీషూట్ చేయాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే.. ఈ కల్ట్ క్లాసిక్ నేటితో ఐదేళ్లు పూర్తి చేసుకుంది. ఇదే విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రేండింగ్ అవుతుంది.
ఇక ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని ‘తుంబాడ్’ మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ‘తుంబాడ్’ సీక్వెల్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. దీంతో సీక్వెల్‌పై ఎక్కడలేని అంచనాలు క్రియేట్ అయ్యాయి.
One of the all time best indian Horror film. Stunning visuals and BGM
A terrifying Experience 🥵
5 years of ‘Tumbbad’🔥 pic.twitter.com/yVaXcmW6e1
— Raj Mohan ☯ (@rajmohan2blue) October 12, 2023
5 years of MASTERPIECE ”TUMBBAD”
A MUST WATCH ✔️ pic.twitter.com/bPeo3eHfy1— 𝗙𝗶𝗹𝗺𝘆 𝗩𝗶𝗲𝘄 (@filmy_view) October 12, 2023
🗓 5 years of Rahi Anil Barve’s Tumbbad
A cinematic masterpiece that delves deep into the human psyche and the consequences of unbridled greed. It weaves a mesmerizing tale of generational avarice in the haunting village of Tumbbad, skillfully blending mythology and horror. 1/3 pic.twitter.com/GL8YFWVacf
— cinedreamer. (@theCineDreamer) October 12, 2023