2018లో వచ్చిన ‘తుంబాడ్’ చిత్రం విమర్శకుల ప్రశంసలందుకొంది. మైథాలజీ, ఫాంటసీ, హారర్ అంశాల కలబోతగా ఓ సరికొత్త ప్రపంచాన్ని ఆవిష్కరిస్తూ ప్రేక్షకుల్ని మెప్పించింది. సోహుమ్షా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి రాహి అనిల్ బార్వీ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్‌ను రూపొందించబోతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్స్టూడియోస్ భాగస్వామ్యంలో హీరో సోహుమ్షా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు.
ఈ సందర్భంగా ఆయన చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘పెన్ స్టూడియో’ భాగస్వామ్యంతో ‘తుంబాడ్’ సీక్వెల్‌ను మరింత ఉన్నత ప్రమాణాలతో తెరకెక్కించబోతున్నాం. తుంబాడ్ యూనివర్స్‌ను కొనసాగించేందుకు మా పార్ట్నర్షిప్ తోడ్పడుతుంది. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఈ సినిమాను ప్రారంభిస్తాం’ అన్నారు. ఈ సీక్వెల్‌కు ఆదేష్ప్రసాద్ దర్శకత్వం వహించనున్నారు.