నేచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం టక్ జగదీష్. ఈ సినిమా ఎలా ఉంటుందో కాని ఈ చిత్రం చుట్టూ జరుగుతున్న వ్యవహారం సంచలనంగా మారింది. నిర్మాతలు ఓటీటీలో విడుదల చేస్తామని ప్రకటించడం, ఎగ్జిబిటర్స్ నానిపై మండిపడడం, ఆ వెంటనే మరో వర్గం నానికి సారి చెప్పటం లాంటివి జరిగాయి. ఈ ఇన్సిడెంట్స్ తరువాత ఫైనల్గా మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. టక్ జగదీష్ డిజిటల్ రిలీజ్ నిర్ణయం పూర్తిగా నిర్మాతలుగా తమదే అన్నారు.
టక్ జగదీష్ చిత్రం ఓటీటీలో విడుదల అవుతుందా, థియేటర్స్లో రిలీజ్ అవుతుందా అనే సందేహంలోనే ఇంకా అభిమానులు ఉన్నారు. ఈ క్రమంలో నాని ఓ సాలిడ్ అనౌన్సమెంట్ ని రేపు ఇవ్వనున్నట్టుగా హింట్ ఇచ్చాడు.తన ట్విట్టర్లో టుమారో అని మాత్రమే రాసుకొచ్చాడు. దీనిని బట్టి చూస్తుంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మాసివ్ అనౌన్సమెంట్ చేయనున్నాడని తెలుస్తుంది.
టక్ జగదీష్ చిత్రం శివ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కగా, ఈ చిత్రంలో రీతూ వర్మ హీరోయిన్ గా నటించగా థమన్ సంగీతం అందించాడు. అలాగే షైన్ స్క్రీన్ సినిమాస్ వారు ఈ చిత్రాన్ని నిర్మాణం వహించారు. నిన్ను కోరి వంటి సూపర్ డూపర్ హిట్ మూవీ తర్వాత నేచురల్ స్టార్ నాని – శివ నిర్వాణ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం టక్ జగదీష్. ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రాబోయే ఈ సినిమాను గత వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని భావించారు. అయితే, కరోనా సెకెండ్ వేవ్ కారణంగా అది సాధ్య పడలేదు.