ఒక్కోసారి షూటింగ్ లొకేషన్స్‌లో ఊహించని సంఘటనలు ఎదురవుతుంటాయి. రీసెంట్గా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండేకు అలాంటి సంఘటనే ఎదురైంది. ప్రస్తుతం తాను ‘తూ మేరీ మై తేరా.. మై తేరా తూ మేరీ’ అనే రొమాంటిక్ లవ్‌స్టోరీలో నటిస్తున్నది. కార్తీక్ ఆర్యన్ ఇందులో కథానాయకుడు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 13న ప్రేమికుల రోజు కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రాజస్థాన్‌లో జరుగుతున్నది. ఆ సినిమా సెట్లోనే అనన్యకు ఊహించని ప్రమాదం ఎదురైంది. అక్కడ దగ్గర్లో ఉన్న ఓ నెమలి ఉన్నట్టుండి అనన్య మీద ఎటాక్ స్టార్ట్ చేసింది. మనుషుల్ని చూస్తేనే నెమళ్లు ఆమడ దూరం పారిపోతుంటాయి. అలాంటిది ఓ నెమలి అనన్యపై ఎటాక్‌కు దిగడంతో అనన్య భయపడిపోయింది.
ఈ హఠాత్పరిణామంతో షాక్‌కు గురైంది అనన్య. అయితే.. చివరకు ఎలాగో ఆ నెమలి శాంతించింది. అనన్యతో స్నేహం కూడా చేయడం మొదలుపెట్టింది. ఈ విషయాన్ని తాను ఇన్‌స్టా ద్వారా తెలియజేస్తూ, ఆ నెమలితో కూడిన తన ఫొటోలను కూడా పోస్ట్ చేసింది. ‘అది శాంతించింది.. చివరికి స్నేహం చిగురించింది.’ అని ఓ క్యాప్షన్ కూడా పెట్టింది అనన్య.