మార్కెట్లో వివిధ రకాల బ్రాండ్లను ప్రమోట్ చేసి..వాటికి పాపులారిటీ తెచ్చే స్టార్లలో మహేశ్ బాబు (Mahesh babu)టాప్ ప్లేస్ లో ఉంటాడు. ఈ సూపర్ స్టార్ చేసే యాడ్స్ కు కూడా ఖచ్చితంగా ఓ రేంజ్ ఉంటుంది. ఎప్పుడూ ఏదో ట్రెండీ ప్రొడక్ట్ ప్రమోషన్లో మెరుస్తుంటాడు మహేశ్. ఈ క్రేజీ హీరో వివిధ పబ్లిక్, ప్రైవేట్ కంపెనీల బస్ టికెట్ల కొనుగోలు కోసం ఏర్పాటు చేసిన వెబ్ సైట్ ‘Abhibus’ కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా మహేశ్‌కున్న పాపులారిటీని టీఎస్ఆర్టీసీ కూడా ప్రమోషన్‌కు వినియోగించుకుంటోంది.
శ్రీమంతుడు (Srimanthudu) సినిమాలో మహేశ్ బాబు కోట్ల ఆస్తిని వదిలిపెట్టి..చిన్న గ్రామానికి వెళ్తున్న క్రమంలో ఆర్టీసీ బస్సు (RTC bus) ఎక్కే సీన్ ఉంటుందని తెలిసిందే. హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వెళ్లే బస్సు ఎక్కి రై..రై..అంటాడు మహేశ్ బాబు. సినిమాలో వచ్చే ఈ సీన్‌ను ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని మరింత ప్రమోట్ చేసుకునేందుకు ఆర్టీసీ డిజిటల్ ప్రమోషన్ వింగ్ వినియోగించుకుంటోంది. ఆ సీన్ స్క్రీన్‌షాట్‌ను అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది ఆర్టీసీ. మీ అన్ని రకాల సురక్షిత ప్రయాణాలకు టీఎస్ఆర్టీసీ బస్సులనే ఎంచుకోండి అంటూ ట్వీట్ చేసింది.
స్టార్ హీరో మహేశ్‌కు ఫాలోవర్ల సంఖ్య కూడా లెక్కలేనంత ఉండటంతో.. ప్రజలు తమ ప్రయాణాలకు సురక్షితమైన ఆర్టీసీ బస్సు వినియోగించాలని టీఎస్ ఆర్టీసీ అధికారులు ఈ రకంగా చేస్తున్న పబ్లిసిటీకి స్పందన అద్బుతంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
టీఎస్ ఆర్టీసీ అధికారులు (public transport service) ప్రజా రవాణా సేవలను ప్రమోట్ చేసేందుకు శ్రీమంతుడు సినిమా క్లిప్‌లను వినియోగించుకోవడంతో ఒక రకంగా ప్రజలు సురక్షితమైన ఆర్టీసీ బస్సు ప్రయాణానికి మరింత దగ్గరవడం పక్కా అంటున్నారు అభిమానులు, ఫాలోవర్లు.
Choose #TSRTCBuses for all your travel needs @urstrulyMahesh@baraju_SuperHit @ganeshbandla@MaheshBabuNews @SVPTheFilm @ParasuramPetla @madhie1 @MaheshBabu_FC @Gopimohan#SarkaruVaariPaata #SVP #BlockbusterSVP @TarakSpace #Saturday @ChaiBisket @idlebrainjeevi @tsrtcmdoffice pic.twitter.com/FzVzhGkY2b
— TSRTC (@TSRTCHQ) May 14, 2022