S.S RAjamouli | టాలీవుడ్ దర్శక దిగ్గజం ఎస్.ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబోలో ఒక సినిమా రానున్న విషయం తెలిసిందే. SSMB29 అంటూ వస్తున్న ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందా అని అటు బాబు ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ తెగ ఎదురుచూస్తున్నారు. హాలీవుడ్ సినిమాను తలపించేలా ఈ సినిమా ఉండబోతుందని రాజమౌళి ఈ సినిమా గురించి ఇప్పటికే హింట్ ఇచ్చాడు. దీంతో మూవీ ఎలా ఉండబోతుందని అందరూ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. మరోవైపు ఈ సినిమాను రూ.1000 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించబోతున్నట్లు సమాచారం.
అయితే ఈ సినిమాకు సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ను పంచుకున్నాడు రాజమౌళి. ఈ సినిమా షూటింగ్ కోసం కెన్యా దేశంలోని అంబోసెలీ నేషనల్ పార్క్‌ను సందర్శించాడు. ఈ మూవీ షూటింగ్‌కు సరిపోతుందా లేదా అనేది తెలియడానికి జక్కన్న ఈ ప్రాంతానికి వెళ్లినట్లు తెలుస్తుంది. మరోవైపు ఈ ఫొటోను షేరు చేస్తూ.. కనుగోనడానికి తిరుగుతున్నా (Trotting to Discover) అంటూ పోస్ట్‌కు క్యాప్షన్ పెట్టాడు. దీంతో మహేశ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించబోతున్నట్లు సమాచారం.