PEDDI | ఆర్ఆర్ఆర్ తర్వాత గేమ్ ఛేంజర్ సినిమాతో ప్రేక్షకులని పలకరించిన రామ్ చరణ్ నిరాశపరిచాడు. ఇప్పుడు మంచి స్క్రిప్ట్‌తో ఫ్యాన్స్‌కి మంచి వినోదం అందించేందుకు సిద్ధమయ్యాడు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబుతో కలిసి పెద్ది అనే సినిమా చేస్తున్నాడు. చరణ్ బర్త్ డే సందర్భంగా ఆయన ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు మేకర్స్. నోట్లో బీడీ, ముక్కుకు పోగుతో, గెడ్డంతో చరణ్ లుక్ ఫ్యాన్స్ కి పిచ్చెక్కించింది. ఈ సారి చరణ్ తన నటనతో అదరగొట్టడం ఖాయం అని అందరు ఫిక్స్ అయ్యారు.అయితే ఏదైన సినిమాకి సంబంధించి పోస్టర్ లేదా వీడియో వచ్చిందంటే ట్రోల్ చేసే బ్యాచ్ ఒకటి రెడీగా ఉంటుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఇప్పుడు ‘పెద్ది’లో రామ్ చరణ్ ఫస్ట్ లుక్‌పై కొందరు విమర్శలు చేస్తున్నారు.
పెద్దిలో రామ్ చరణ్ లుక్ అచ్చం ‘పుష్ప’లో అల్లు అర్జున్‌లానే ఉందని అంటున్నారు. రెండు పోస్టర్స్ రిలీజ్ చేయగా.. ఒకటి పుష్పలో అల్లు అర్జున్‌లా ఉందని.. మరొకటి కేజీఎఫ్‌లో యష్లా ఉందంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇంకొక నెటిజన్ అయితే పుష్ప వైబ్స్ గుర్తుకొచ్చాయంటూ కామెంట్ చేశాడు. పుష్పలాగే ‘పెద్ది’ కూడా అదే ఇంటెన్సిటీతో కనిపిస్తాడేమో అని ముచ్చటించుకుంటున్నారు. ఈ కామెంట్స్‌పై చరణ్ ఫ్యాన్స్ గట్టిగా స్పందిస్తున్నారు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ లుక్ కూడా చరణ్ ‘రంగస్థలం’ మూవీ నుంచి వచ్చిందే అంటూ వాదిస్తున్నారు.
చిట్టిబాబు లుక్ నుంచే పుష్ప లుక్ వచ్చిందని ఒకరు అంటుండగా, మరికొందరు అసలు ఆ లుక్స్‌కు ఈ లుక్స్‌కి ఎలాంటి పోలికే లేదని కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఫ్యాన్స్ మాత్రం లుక్స్ విషయంలో ఓ కొత్త వాదనకు తెరతీశారు. ఇక చిత్రంలో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తున్నారు. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, మీర్జాపూర్ ఫేం దివ్యేందు, సీనియర్ నటుడు జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పెద్ది లుక్‌పై మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ.. పెద్ది చాలా ఇంటెన్స్ గా కనిపిస్తోందని.. చెర్రీలోని నటనను మరో కొత్త కోణంలో ఆవిష్కరించే చిత్రంగా పెద్ది నిలుస్తుందన్నారు. ఫ్యాన్స్ కు ఈ చిత్రం కనులపండగ కానుందని ఆశాభావం వ్యక్తం చేశారు.