మంగళవారం 02 మార్చి 2021
Cinema - Jan 13, 2021 , 15:22:29

త్రివిక్ర‌మ్ తో నా సినిమా ప‌క్కా ఉంట‌ది: రామ్

త్రివిక్ర‌మ్ తో నా సినిమా ప‌క్కా ఉంట‌ది: రామ్

టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్, డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్ లో సినిమా రానున్న‌ట్టు ఇప్ప‌టికే ప‌లుసార్లు వార్త‌లు తెర‌పైకి వ‌చ్చాయి. అయితే త్రివిక్ర‌మ్ మ‌రోవైపు ఎన్టీఆర్ తో సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో..ఇప్ప‌ట్లో రామ్ తో సినిమా  ఉండ‌క‌పోవ‌చ్చ‌నుకున్నారు సినీ జ‌నాలు. అయితే దీనిపై క్లారిటీ వచ్చింది. రెడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రామ్ త్రివిక్ర‌మ్ తో సినిమా విష‌య‌మై క్లారిటీ ఇచ్చాడు.

నా కోసం క‌థ రాస్తున్నార‌న్న వార్తల్లో వాస్త‌వం కాదు. కానీ త్రివిక్ర‌మ్ న‌న్ను డైరెక్ట్ చేస్తారు. ఖ‌చ్చితంగా మా ఇద్ద‌రి కాంబినేషన్ లో ప‌క్కా సినిమా ఉంటుందని స్ప‌ష్టం చేశాడు. రామ్ కామెంట్స్ తో ఇక తెర‌పై మాట‌ల మాంత్రికుడు-రామ్ కాంబినేష‌న్ ను చూడొచ్చ‌ని సంబురాలు చేసుకుంటున్నారు ఫ్యాన్స్ . ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ ప‌లు క‌మిట్‌మెంట్స్ తో బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది ఎన్టీఆర్ సినిమాను టేక‌ప్ చేయ‌నున్నాడు. వ‌చ్చే ఏడాది రాంచ‌ర‌ణ్, ఆ త‌ర్వాత అల్లు అర్జున్ సినిమాల‌ను లైన్ లోపెట్టే అవ‌కాశ‌ముంది. ఈ నేప‌థ్యంలో రామ్ తో సినిమా చేయాలంటే క‌నీసం రెండేళ్ల‌కు పైగానే ప‌ట్ట‌నుంద‌న్న‌మాట‌.

ఇవి కూడా చ‌ద‌వండి

ఈ సంక్రాంతి సినిమాల స్పెషాలిటీ ఏంటంటే..?


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo