ఆదర్శ కుటుంబం విడుదల అప్పుడేనా?
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అగ్ర కథానాయకుడు వెంకటేశ్ హీరోగా రూపొందుతున్న క్రైమ్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఆదర్శకుటుంబం’. ‘హౌస్ నెం.47 - ఏకే 47’ అనేది ఉపశీర్షిక. శ్రీనిధిశెట్టి కథానాయిక.
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అగ్ర కథానాయకుడు వెంకటేశ్ హీరోగా రూపొందుతున్న క్రైమ్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఆదర్శకుటుంబం’. ‘హౌస్ నెం.47 – ఏకే 47’ అనేది ఉపశీర్షిక. శ్రీనిధిశెట్టి కథానాయిక. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. నిజానికి ఈ సినిమాను త్వరగా పూర్తిచేసి సమ్మర్లోనే విడుదల చేయాలని ముందు మేకర్స్ భావించారు.
కానీ నాణ్యత విషయంలో రాజీ పడని కారణంగా అది జరగలేదు. సమ్మర్ తర్వాత సినిమాకు అతిపెద్ద సీజన్ అంటే అది దసరా సీజనే. అందుకే దసరా కానుకగా అక్టోబర్ 16న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనే సంకల్పంతో మేకర్స్ ఉన్నట్టు తెలిసింది. వెంకటేశ్ నటించిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి చిత్రాలకు రచయితగా పనిచేసిన త్రివిక్రమ్.. తొలిసారి ఆయన్ను డైరెక్ట్ చేస్తున్నారు. దాంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
NXTinAI | వెండితెరపై కృత్రిమ మేధ హవా.. గ్యాలరీ5 ‘నెక్ట్స్ఇన్ఏఐ’ సదస్సు
PM Modi | ప్రభుత్వం మారినా రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం.. తమిళనాడులో ప్రధాని మోదీ
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

