Trivikram – Vijay Devarakonda | మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం లక్కీ భాస్కర్ (Lucky Bhaskar). గత ఏడాది ‘సార్’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. మీనాక్షి చౌదరి (Meenakshi Chowdary) హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్లో గ్రాండ్గా నిర్వహించారు మేకర్స్. ఇక ఈ ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథులుగా రౌడి హీరో విజయ్ దేవరకొండతో పాటు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వచ్చి సందడి చేశారు.
ఈ వేడుకలో త్రివిక్రమ్ మాట్లాడుతూ.. దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండలపై ప్రశంసలు కురిపించాడు. ఈతరం గొప్పనటులు దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ. వాళ్లీద్దరిని ఒక వేదికపైన చూడడం ఆనందంగా ఉంది. విజయ్ గురించి మీకు చెప్పాలి. నేను అభిమానించే నటులలో విజయ్ ఒకడు. ఎంతో ప్రేమను చూసాడు విజయ్, అంత కంటే రెట్టింపు ద్వేషం కూడా చూసాడు. ఆ రెండు తక్కువ టైంలో ఒకేసారి చూడడం అంటే. దేవరకొండ బాలగంగాధర్ తిలక్ అమృతం కురిసిన రాత్రి నవలలో ఒక లైన్ ఉంటుంది. మావాడే మహాగట్టివాడని. విజయ్ దేవరకొండకు అది వర్తిస్తుంది. మా వాడు మహా గట్టోడు అంటూ త్రివిక్రమ్ చెప్పుకోచ్చాడు.