Trivikram | మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈసారి ఫ్యామిలీ ఎంటర్టైనర్కి శ్రీకారం చుట్టబోతున్నట్లు సమాచారం. ముందు అల్లు అర్జున్‌తో పాన్ ఇండియా స్థాయిలో పురాణ నేపథ్యంలో ఓ భారీ చిత్రం చేయాలని త్రివిక్రమ్ భావించగా, అది కార్యరూపం దాల్చలేదు. అదే కథను ఇప్పుడు తారక్‌తో ప్లాన్ చేస్తున్నట్లు టాక్. అయితే ఆ ప్రాజెక్ట్ మొదలయ్యేలోపు, ఓ మీడియం బడ్జెట్ చిత్రాన్ని పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నారు త్రివిక్రమ్. ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, త్రివిక్రమ్ – విక్టరీ వెంకటేష్ కాంబినేషన్లో ఓ కొత్త సినిమా రాబోతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఇది వెంకటేష్‌కి 77వ సినిమా అవుతుందట. అధికారిక ప్రకటన వెలువడకపోయినా, ఈ ప్రాజెక్ట్‌ను సైలెంట్‌గా సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రానికి ‘వెంకట రమణ’ అనే టైటిల్ పరిశీలనలో ఉందని తెలుస్తోంది. టైటిల్‌కు “కేర్ ఆఫ్ ఆనంద నిలయం” అనే ట్యాగ్‌లైన్ పెట్టనున్నారట. త్రివిక్రమ్ సినిమాల్లో తరచుగా కనిపించే “ఇంటి సెంటిమెంట్” ఇందులోనూ ప్రధానంగా ఉండబోతోందని సంకేతాలు అందుతున్నాయి.అల వైకుంఠపురంలో, అత్తారింటికి దారేది, గుంటూరు కారం వంటి సినిమాల్లో మాదిరిగానే ఇది కూడా ఓ ఇంటి చుట్టూ తిరిగే కథ కావొచ్చని ఆలోచన చేస్తున్నారు.
వెంకటేష్ కోసం ప్రత్యేకమైన కథను త్రివిక్రమ్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇది అభిమానులను ఆకట్టుకునేలా, సింపుల్ అండ్ టచింగ్‌గా ఉండనుందట. ఈ సినిమా 2025 ఆగస్టులో సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. 2026 సమ్మర్ రిలీజ్ లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ చిత్రం గురించి అధికారికంగా ఇంకా ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు. త్వరలోనే టైటిల్, కథా విషయాలు, ఇతర నటీనటుల వివరాలు వెల్లడి అయ్యే అవకాశముంది. కాగా, వెంకటేష్..చిరంజీవి – అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతోన్న చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.