రంజిత్‌కుమార్ నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం ‘త్రిశెంకినీ’. పలువురు నూతన తారలు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎన్ బిక్కునాథ్ నాయక్ నిర్మాత. ఈ సినిమా టైటిల్ లాంచ్ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. ప్రముఖ హాస్యనటుడు బాబూమోహన్ టైటిల్‌ని లాంచ్ చేసి, చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు.
ఓ సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఇదని నిర్మాత ఎన్.బిక్కునాథ్ నాయక్ చెప్పారు. చిరంజీవి పుట్టినరోజున మా సినిమా టైటిల్ లాంచ్ జరగడం చాలా ఆనందంగా ఉందని దర్శకుడు రంజిత్‌కుమార్ అన్నారు. అతిథిగా విచ్చేసిన మరో అతిథి డా.రాజేంద్ర కూడా మాట్లాడారు. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రానికి కెమెరా, ఎడిటింగ్, వీఎఫ్ఎక్స్: విశ్వక్ స్టూడియో, సంగీతం: వీఆర్కే, నిర్మాణం: ఎన్.బి.జె.ప్రొడక్షన్స్.