The Road | సౌతిండియన్ ఫిలిం ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్గా కొనసాగుతోంది త్రిష (Trisha). త్రిష ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ది రోడ్ (The Road). రివేంజ్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీ అక్టోబర్ 6న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానున్నట్టు ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు మేకర్స్. కాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ అప్డేట్ కూడా అందించి మూవీ లవర్స్, అభిమానుల్లో జోష్ నింపుతున్నారు.
సెప్టెంబర్ 21న ది రోడ్ ట్రైలర్‌ను లాంఛ్ చేస్తున్నట్టు తెలియజేశారు. మొదట ఈ చిత్రాన్ని తమిళంలో విడుదల చేయనున్నారు. ఆ తర్వాత వివిధ భాషల్లో ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మేకర్స్ ఇటీవలే ది రోడ్ నుంచి ఫస్ట్ సింగిల్ ఓ విధి (Oh Vidhi Promo) అంటూ సాగే పాట ప్రోమో, లిరికల్ వీడియో సాంగ్‌ను లాంఛ్ చేశారు. శ్యామ్ సీఎస్ కంపోజ్ చేసిన ఓ విధి సాంగ్ సిద్ శ్రీరామ్ మ్యాజికల్ వాయిస్‌తో సాగుతూ అందరినీ ఆకట్టుకుంటోంది. కార్తీక్ నేత ఈ పాటను రాశాడు.
అరుణ్ వసీగరన్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో డ్యాన్సింగ్ రోజ్గా పాపులర్ అయిన మాలీవుడ్ నటుడు షబీర్ (Shabeer Kallarakkal) కీ రోల్ పోషిస్తున్నాడు. ఏఏఏ సినిమా బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి శ్యామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నాడు. త్రిష మరోవైపు లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్వకత్వంలో ఉలగనాయగన్ కమల్ హాసన్ నటిస్తోన్న KH234 లో ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది.
త్రిష ప్రస్తుతం లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ టైటిల్ రోల్ పోషిస్తోన్న లియోలో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోండగా.. అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. అదేవిధంగా అజిత్ కొత్త ప్రాజెక్ట్ Vidaa Muyarchia లో హీరోయిన్గా ఫైనల్ అయినట్టు వార్తలు వస్తుండగా.. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ట్రైలర్ టైం ఫిక్స్..
The #PainOfMeera leads onto #RevengeOfMeera #TheRoad Trailer from 21.09.2023 .Get ready!#RevengeFromOct6#TheRoad@trishtrashers @Actorsanthosh @actorshabeer @actorvivekpra @Arunvaseegaran1 @SamCSmusic @tipsofficial@idiamondbabu @akash_tweetz pic.twitter.com/cd1ySQWJqy
— AAA_CINEMAA (@aaa_cinemaa) September 18, 2023
ఓ విధి సాంగ్ ప్రోమో..
ఓ విధి సాంగ్..