ప్రస్తుతం సినిమాలకంటే రాజకీయపరమైన కారణాలతోనే అగ్ర కథానాయిక త్రిష వార్తల్లో నిలుస్తున్నది. తమిళనాడు సీఎం విజయ్ సన్నిహితురాలిగా చలామణి అవుతూ అక్కడి రాజకీయ వర్గాల్లో కూడా ప్రత్యేకతను చాటుకుంటున్నది. ఇదిలావుండగా త్రిష నటించిన ఓ తమిళ సినిమా 12 ఏండ్ల తర్వాత విడుదలకు సిద్ధమవుతుండటం విశేషం. వివరాల్లోకి వెళితే.. అరవింద్‌స్వామితో త్రిష నటించిన ‘శతురంగ వట్టై-2’ 2014లో చిత్రీకరణ పూర్తిచేసుకుంది. అయితే ఆర్థిక సమస్యల కారణంగా సినిమా విడుదలకు నోచుకోలేదు.
ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీకి ఆర్వీ నిర్మల్‌కుమార్ దర్శకుడు. హెచ్ వినోద్ కథనందించారు. త్రిష దక్షిణాదిలో అగ్ర కథానాయికగా దూసుపోతున్న రోజుల్లో చేసిన సినిమా కావడంతో ఇప్పటికీ ఆమె అభిమానులు రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. ప్రస్తుతం తమిళనాట త్రిషకు ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా కమర్షియల్‌గా వర్కవుట్ అవుతుందని నిర్మాతలు ధీమాతో ఉన్నారట. త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తారని సమాచారం.