Trisha | దక్షిణాది సినీ పరిశ్రమలో వన్ ఆఫ్ ది బిజీయెస్ట్ హీరోయిన్గా మారిపోయింది చెన్నై చంద్రం త్రిష (Trisha). రెండు దశాబ్దాలకుపైగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ మూవీ లవర్స్‌ను ఫిదా చేస్తోంది త్రిష . ఈ ఏడాది మణిరత్నం భారీ మల్టీస్టారర్ పొన్నియన్ సెల్వన్-2తో సూపర్ సక్సెస్ అందుకున్న త్రిష.. ప్రస్తుతం వరుస సినిమాలతో తీరిక లేకుండా ఉంది.
సోషల్ మీడియాలో ఈ భామకుండే క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తాజాగా త్రిష ఒడిలో బుడతడు సందడి చేసిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఇంతకీ ఆ పిల్లాడు ఎవరై ఉంటారు.. అంటూ తెగ చర్చించుకోవడం మొదలుపెట్టారు వీడియో చూసిన నెటిజన్లు. మరి త్రిష ఎత్తుకున్న బుడతడెవరనే కదా మీ డౌటు. మలయాళ నటి మియా జార్జ్ కుమారుడు.
త్రిష వన్ ఆఫ్ ది లీడ్ రోల్లో నటించిన చిత్రం ది రోడ్. ఇందులో మలయాళ భామ మియాజార్జ్ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ టైంలో త్రిష ఇలా మియాజార్జ్ కుమారుడిని ఎత్తుకొని కనిపించింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ది రోడ్ అక్టోబర్ 6న థియేటర్లలో సందడి చేయనుంది.
త్రిష నటిస్తోన్న సినిమాల్లో ఒకటి లియో. విజయ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. త్రిష మరోవైపు మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ నటిస్తోన్న రామ్.. పార్టు 1, సథురంగ వెట్టై 2, కమల్ హాసన్- మణిరత్నం కాంబో ప్రాజెక్ట్ కమల్ హాసన్ 234 (KH 234) , అజిత్‌కుమార్ (Ajithkumar), మగిజ్ తిరుమేని కాంబోలో వస్తున్న VidaaMuyarchiలో నటిస్తోంది.
@trishtrashers with #MiyaGeorge ‘s son during #TheRoad shoot.#RevengeFromOct6 #TheRoadFromOct6 #Trisha #SouthQueenTrisha pic.twitter.com/t8vqbbev6W
— Trisha Krishnan FC (@ActressTrisha) October 4, 2023
Actress @khushsundar about #SouthQueen @trishtrashers 🤗😍 #Trisha #Vikatan pic.twitter.com/0uFlSMmPUM
— Arun Kumar 🗡 (@aruntrish) August 4, 2023