ధనుష్‌తో జోడీగా..
అదృష్టం అంటే త్రిషదే అంటున్నారు చెన్నై సినీ జనాలు. కొన్నేళ్ల క్రితం వరుస ఫ్లాపులతో ఈ భామ కెరీర్ ప్రశ్నార్థకంలో పడింది. అయితే ‘పొన్నియన్ సెల్వన్' విజయం ఆమెకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది. ప్రస్తుతం తమిళంలో ఈ అమ్మడు వరుసగా భారీ చిత్రాల్ని అంగీకరిస్తూ బిజీగా ఉంది.
అదృష్టం అంటే త్రిషదే అంటున్నారు చెన్నై సినీ జనాలు. కొన్నేళ్ల క్రితం వరుస ఫ్లాపులతో ఈ భామ కెరీర్ ప్రశ్నార్థకంలో పడింది. అయితే ‘పొన్నియన్ సెల్వన్’ విజయం ఆమెకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది. ప్రస్తుతం తమిళంలో ఈ అమ్మడు వరుసగా భారీ చిత్రాల్ని అంగీకరిస్తూ బిజీగా ఉంది. విజయ్ సరసన ‘లియో’తో పాటు కమల్‌హాసన్ 234వ చిత్రంలో కూడా త్రిష కథానాయికగా నటిస్తున్నది. ఇటీవలే గౌరవ్ నారాయణన్ దర్శకత్వంలో ఓ మహిళా ప్రధాన చిత్రానికి అంగీకరించింది.
తాజా సమాచారం ప్రకారం ధనుష్ సరసన త్రిష ఓ చిత్రంలో నటించబోతున్నట్లు తెలిసింది. స్వీయ దర్శకత్వంలో ధనుష్ నటించనున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించనుంది. ఇందులో త్రిష నాయికగా ఖరారైంది. గతంలో ‘కొడి’ చిత్రంలో ధనుష్‌తో జోడీ కట్టింది త్రిష. సుదీర్ఘ విరామం తర్వాత ఈ జంట వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమవడం విశేషం. ఈ చిత్రానికి ఏ.ఆర్.రెహమాన్ సంగీతాన్నందిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

