Trisha Krishnan | హీరోయిన్గా త్రిషకు ఉన్న లాంగ్విటీ ఇప్పుడున్న హీరోయిన్లలో ఎవరికీ లేదని చెప్పాలి. ఇప్పటికీ అటు సినిమాలు, ఇటు వెబ్ సిరీస్ చేస్తూ బిజీబిజీగా ఉన్నారామె. అజిత్‌తో ఆమె నటించిన ‘విడాముయార్చి’ సినిమా ‘పట్టుదల’ పేరుతో తెలుగులో విడుదల కానుంది. ఇంకా గుడ్ బ్యాడ్ అగ్లీ, విశ్వంభర, థగ్‌లైఫ్ చిత్రాలతో క్షణం తీరిక లేకుండా ఉన్నారు త్రిష. ఇటీవల ‘విడాముయార్చి’ ప్రమోషన్లో భాగంగా మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు త్రిష. ఈ సందర్భంగా దళపతి విజయ్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.
‘నేనూ విజయ్ మంచి ఫ్రెండ్స్. తనో ఇంట్రావర్ట్. షాట్ అవ్వగానే ఒక్కడే ఏదో గొడ చూసుకొని, అక్కడే కుర్చీ వేసుకొని అందరికీ దూరంగా కూర్చుంటాడు. అలా కూర్చోవద్దు.. అందరితో కలిసుండాలని నేను చాలాసార్లు చెప్పాను. నవ్వి ఊరుకునేవాడు. తనకు పాలిటిక్స్‌పై ఎప్పట్నుంచో ఇంట్రస్ట్ ఉంది. అది నాకు తెలుసు. తన ఆలోచనలన్నీ భిన్నంగా ఉంటాయి. ఏదో సాధించాలనే దృక్పధంతో ఉండేవాడు. కచ్ఛితంగా అనుకున్నది మాత్రం సాధిస్తాడని నా నమ్మకం.’ అని తెలిపింది త్రిష.