The Road Movie | చిత్రసీమలో దాదాపు రెండు దశాబ్దాలుగా రాణిస్తున్నది స్టార్ హీరోయిన్ త్రిష (Trisha Krishnan). ఇప్పటికీ వన్నె తరగని అందంతో అలరారుతున్నది. ఐదేళ్ల క్రితం వచ్చిన ‘96’ చిత్రంతో త్రిష కెరీర్ మరలా ఊపందుకుంది. ఇక ఇటీవల విడుదలైన ‘పొన్నియన్ సెల్వన్’ 1, 2 చిత్రాలు ఆమెకు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చాయి. ఈ సినిమాలో మహారాణి కుందవైగా ఆమె నటన ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. ప్రస్తుతం త్రిష నటిస్తున్న తాజా లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘ది రోడ్’ (The Road). రివెంజ్ ఇన్ 462 కిలోమీటర్స్ (Revenge in 462 kms) అనేది ఉప శీర్షిక. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన మేకింగ్ టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్లు మూవీపై అంచనాలను ఓ రేంజ్ లో పెంచేశాయి. తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు. ఇక ఈ ట్రైలర్ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది. యూట్యూబ్‌లోనే సెట్టింగ్స్‌పై క్లిక్ చేసి ఆడియో ట్రాక్ ఆప్షన్‌లోకి వెళ్లి మీకు నచ్చిన భాషను ఎంపిక చేసుకోవచ్చు.
ట్రైలర్ గమనిస్తే.. తమిళనాడులోని జాతీయ హైవేలపై జరిగిన కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. జాతీయ హైవేలోని ఒకటే ప్రదేశంలో హత్యలు జరగడం. దాని వెనక ఉన్నది ఎవరు అనేది తెలుసుకోవడానికి త్రిష ప్రయత్నిస్తుంది. క్రైమ్ థ్రిల్లర్, రివేంజ్ డ్రామా నేపథ్యంలో కట్ చేసిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ఈ మూవీని అక్టోబర్ 6న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు.
Let #TheRoad trip begin!
Happy to release the trailer of #TheRoad https://t.co/nMRs94j8rg
All the best Jessie, (oops sorry)
@trishtrashers#RevengeFromOct6#TheRoadTrailer @aaa_cinemaa @Actorsanthosh @actorshabeer @actorvivekpra @Arunvaseegaran1 @SamCSmusic…— Gauthamvasudevmenon (@menongautham) September 21, 2023
అరుణ్ వసీగరన్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో డ్యాన్సింగ్ రోజ్గా పాపులర్ అయిన మాలీవుడ్ నటుడు షబీర్ (Shabeer Kallarakkal) కీ రోల్ పోషిస్తున్నాడు. ఏఏఏ సినిమా బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి శ్యామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నాడు. త్రిష మరోవైపు లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్వకత్వంలో ఉలగనాయగన్ కమల్ హాసన్ నటిస్తోన్న KH234 లో ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది.