Trisha |సౌత్ స్టార్ హీరోయిన్ త్రిష ప్రస్తుతం సినిమాలకే కాదు, రాజకీయ వార్తలతో కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా తమిళ స్టార్ హీరో విజయ్ స్థాపించిన రాజకీయ పార్టీ తమిళగ వెట్రికళగంతో ఆమె పేరు ముడిపడటంతో, త్రిష రాజకీయ అరంగేట్రంపై ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె సినిమాలకు గుడ్ బై చెబుతుందన్న ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరిగింది. అయితే ఈ రూమర్స్‌పై ఇటీవలే త్రిష క్లారిటీ ఇచ్చి, ప్రస్తుతం తన ఫోకస్ పూర్తిగా సినిమాలపైనే ఉందని తెలిపింది. దీంతో రాజకీయ ప్రవేశంపై వస్తున్న వార్తలకు కొంతవరకు ఫుల్స్టాప్ పడింది.
ఇదిలా ఉంటే, తాజాగా త్రిష చేసిన ఓ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. “ఒక గంట నిద్ర కోల్పోతే, దాని నుంచి కోలుకోవడానికి నాలుగు రోజులు పడుతుంది. ఆ లెక్కన చూస్తే నేను 2062లో గానీ పూర్తిగా రికవర్ కాలేను” అంటూ ఆమె సరదాగా పోస్ట్ చేయడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. త్రిషకు నిద్రలేమి సమస్య ఉందా? లేదా ఇది కేవలం సరదా వ్యాఖ్యనా? అంటూ చర్చిస్తున్నారు. కొందరు అభిమానులు ఆమె ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తం చేస్తుండగా, మరికొందరు ఆమె తన రాత్రిపూట మేల్కొని ఉండే అలవాటును ఫన్నీగా చెప్పిందని భావిస్తున్నారు.
త్రిష సోషల్ మీడియాలో చేసే పోస్టులు ఎప్పుడూ ప్రత్యేకంగా ఉండటంతో, ఈసారి కూడా ఆమె తన స్టైల్లోనే నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. చిన్న విషయాన్నే ఆసక్తికరంగా మార్చి ట్రెండ్ సెట్ చేయడంలో ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఉంది. కెరీర్ విషయానికి వస్తే, త్రిష వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఆమె హీరోయిన్గా నటించిన ‘కరుప్పు’ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంపై అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.