Leo Movie | అందరికంటే ముందుగా దసరా స్లాట్‌ను బుక్ చేసుకుని.. అదే దిశగా పరుగులు పెడుతుంది లియో సినిమా. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, గ్లింప్స్ గట్రా సినిమాపై అంతకంతకూ అంచనాలు పెంచుకుంటూ వస్తున్నాయి. పైగా విక్రమ్ తర్వాత లోకేష్ డైరెక్ట్ చేసిన మూవీ కావడంతో లియో మీద మాములు అంచనాలు లేవు. బిజినెస్ లెక్కలు సైతం రెండొందల కోట్ల పై చీలుకే అని తెలుస్తుంది. ఇప్పటికే టాకీ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ప్రస్తుతం డబ్బింగ్ సహా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఒక్కోటి కొలిక్కి దశకు వచ్చేస్తున్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్లు, పోస్టర్లు గట్రా రిలీజ్ చేస్తూ సినిమాపై అటెన్షన్ క్రియేట్ చేస్తున్నారు.
తాజాగా ఈ సినిమాలో నుంచి త్రిష పోస్టర్‌ను రిలీజ్ చేశారు. రక్త పాతం చూస్తూ భయంతో షాక్ అయినట్లు పెట్టిన పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇక మరి కాసేపట్లో ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కాబోతుంది. పాన్ ఇండియా రిలీజ్ కాబట్టి ఈ సారి కాస్త పెద్ద ఎత్తున ప్రమోషన్లు గట్రా ప్లాన్ చేస్తున్నారట. మరీ ముఖ్యంగా తెలుగులోనూ ఈ సినిమా ప్రమోషన్లు భారీ ఎత్తులో జరపాలని చూస్తున్నారట. ఎందుకంటే ఇటీవల కాలంలో తెలుగులో డబ్ అయిన కొన్ని తమిళ సినిమాలు ఊహించని రేంజ్లో కలెక్షన్లు కొల్లగొట్టాయి. దాంతో ఈ సినిమాను పెద్ద లెవల్లో ప్రమోట్ చేసి సినిమాపై క్రేజ్‌ను మరింత తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారు.
ఇక ఈ సినిమాపై వీర లెవల్లో బిజినెస్ జరగుతుంది. ఎప్పుడూ లేనిది తెలుగు డబ్బింగ్ హక్కుల కోసం సితార సంస్థ ఏకంగా 21 కోట్లు పెట్టి కొనడం టాలీవుడ్ ట్రేడ్‌నే ఆశ్చర్యపరిచింది. పైగా పోటీగా భగవంత్ కేసరీ, టైగర్ నాగేశ్వరరావు వంటి భారీ సినిమాలు ఉండగా ఆ రేటు పెట్టడం అంటే రిస్క్ అనే చెప్పాలి. తమిళనాడులో సైతం ఈ సినిమా కోసం పలువురు డిస్ట్రిబ్యూటర్లు తెగ పోటీ పడుతున్నారట.
Unveiling the most-awaited look of @trishtrashers 💥#LeoTrailer is releasing today 💥#Thalapathy @actorvijay sir @Dir_Lokesh @anirudhofficial @duttsanjay @akarjunofficial @7screenstudio @Jagadishbliss @SunTV @SonyMusicSouth #Leo#LeoTrailerFromToday pic.twitter.com/oe15rahOw5
— Seven Screen Studio (@7screenstudio) October 5, 2023