Trisha |దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటి త్రిష కృష్ణన్‌కి ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికీ కుర్ర హీరోయిన్స్‌కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన పాత్రలతో అలరిస్తుంది. అయితే గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న తప్పుడు వార్తలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తన పెళ్లి, రాజకీయ ప్రవేశం వంటి రూమర్లు సోషల్ మీడియాలో హడావుడి చేయడంతో, త్రిష నేరుగా స్పందిస్తూ ఆ వార్తలను ఖండించారు. త్రిష ఓ స్టార్ హీరోను పెళ్లి చేసుకోబోతోంది”, “త్రిష రాజకీయాల్లోకి వస్తోంది” వంటి కథనాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. స్నేహితులతో దిగిన ఫోటోలను వక్రీకరించి తప్పుదోవ పట్టించే వార్తలు పెరుగుతుండటంతో త్రిష తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
నేను ఎవరితో ఫోటో దిగితే వారినే పెళ్లి చేసుకున్నట్టేనా? ఇంకా ఎంతమందితో నా పెళ్లి చేస్తారు? స్నేహితులతో దిగిన ఫోటోలను చూపించి అసంబద్ధమైన కథనాలు రాయకండి. అలాంటి రూమర్లు చూస్తుంటే అసహ్యం వేస్తోంది. ఇకనైనా ఫేక్ న్యూస్ ప్రచారం ఆపండి అంటూ ఆమె సోషల్ మీడియాలో ఇండైరెక్ట్‌గా వార్నింగ్ ఇచ్చారు. మరి ఈ వార్నింగ్‌తో అయిన త్రిషకి సంబంధించిన రూమర్స్‌కి పులిస్టాప్ పడుతుందా చూడాలి. ఇక సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం త్రిష మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ యాక్షన్–ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ లో నటిస్తున్నారు. వశిష్ట దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో, అత్యాధునిక గ్రాఫిక్స్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇప్పటికే విడుదలైన టీజర్, పాట సినిమా హైప్‌ను మరింత పెంచాయి. దాదాపు ₹150 కోట్లు ఖర్చుతో రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ పూర్తయింది. మొదటగా 2025 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేసినప్పటికీ, అనుకోని కారణాల వల్ల వాయిదా పడింది. తాజా సమాచారం ప్రకారం 2026 సమ్మర్లో విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే చాలా కాలం తర్వాత తెలుగులో నేరుగా ఒక చిత్రం చేస్తోన్న త్రిషకు ‘విశ్వంభర’ ఎలా ఫలితాన్ని ఇస్తుందో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.