Trisha | త్రిష రిటైర్మెంట్ గుసగుసలు .. గట్టిగా ఇచ్చి పడేసిన చెన్నై చంద్రం
Trisha | దక్షిణాది చిత్ర పరిశ్రమలో రెండు దశాబ్దాలుగా అగ్ర కథానాయికగా వెలుగొందుతున్న త్రిష కృష్ణన్ గురించి సంచలన వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆమె తన సుదీర్ఘ సినీ ప్రయాణానికి త్వరలోనే ముగింపు పలకబోతున్నారనే ప్రచారం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న ప్రాజెక్టులను మాత్రమే పూర్తి చేస్తూ, కొత్త సినిమాలకు సంతకం చేయకపోవడం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది.
Trisha | దక్షిణాది చిత్ర పరిశ్రమలో రెండు దశాబ్దాలుగా అగ్ర కథానాయికగా వెలుగొందుతున్న త్రిష కృష్ణన్ గురించి సంచలన వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆమె తన సుదీర్ఘ సినీ ప్రయాణానికి త్వరలోనే ముగింపు పలకబోతున్నారనే ప్రచారం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న ప్రాజెక్టులను మాత్రమే పూర్తి చేస్తూ, కొత్త సినిమాలకు సంతకం చేయకపోవడం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి సరసన నటిస్తున్న విశ్వంభర చిత్రం ఆమె కెరీర్లో చివరి సినిమా కావొచ్చని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ప్రముఖ సినీ విశ్లేషకుడు, సీనియర్ జర్నలిస్ట్ చిత్ర లక్ష్మణన్ తన ‘టూరింగ్ టాకీస్’ ఛానెల్లో చేసిన వ్యాఖ్యలు ఈ వార్తలకు మరింత ఊతమిచ్చాయి. త్రిష ఇకపై సినిమాల్లో నటించకూడదని నిర్ణయించుకున్నారని, కొంతమంది నిర్మాతలు తనకు ఈ విషయాన్ని వెల్లడించారని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ వార్తలపై స్పందించిన త్రిష..అవును నేను సినిమాలు మానేసి ఒక పెద్ద వ్యాపార వేత్తని వివాహం చేసుకొని నలుగురు పిల్లల్ని కన్నాను.మీ ఆలోచనలకి ఈ సమాధానం సరిపోతుందా, మీరు వార్తలు రావడానికి ఇది సరిపోతుందా..లేక ఇంకేదైన స్టఫ్ కావాలా అంటూ త్రిష గట్టిగా కౌంటర్ ఇచ్చింది.
ఇక ఇదిలా ఉంటే తమిళ స్టార్ విజయ్.. త్రిష సంబంధంపై గత కొంతకాలంగా సోషల్ మీడియాలో పలు ఊహాగానాలు వస్తున్నాయి. వీరిద్దరూ లివ్-ఇన్ రిలేషన్లో ఉన్నారనే ప్రచారం, అలాగే విజయ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలు కూడా ఈ రిటైర్మెంట్ గాసిప్‌కు మరింత ఊతమిచ్చాయి. ఇటీవల ఒక వివాహ వేడుకలో ఇద్దరూ ఒకే తరహా దుస్తుల్లో కనిపించడం, అక్కడి నుంచి కలిసి వెళ్లడం వంటి సంఘటనలు మీడియా దృష్టిని ఆకర్షించాయి. అయితే ఈ విషయాలపై వచ్చిన ప్రశ్నలకు త్రిష ఎలాంటి స్పందన ఇవ్వకపోవడం మరింత అనుమానాలకు దారితీసింది. కాగా, త్రిష నటించిన కరుప్పు(తెలుగులో ‘వీరభద్రుడు’) విడుదలకు సిద్ధంగా ఉంది. ఫాంటసీ నేపథ్యంతో రూపొందిన ఈ చిత్రంలో ఆమె పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

