‘యానిమల్’ సినిమాతో దేశవ్యాప్తంగా యువతలో మంచి క్రేజ్ సంపాదించుకుంది త్రిప్తి దిమ్రి. . ప్రభాస్-సందీప్‌రెడ్డి వంగా ‘స్పిరిట్’ చిత్రం నుంచి దీపికా పదుకోన్ తప్పుకోవడంతో ఆమె స్థానంలో త్రిప్తి దిమ్రిని నాయికగా ఎంపిక చేశారు. తాజా ఇంటర్వ్యూలో ఈ భామ తాను నటిస్తున్న సినిమాల విశేషాలను వెల్లడించింది.
“స్పిరిట్’ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. బలమైన భావోద్వేగాలు కలబోసిన కథ ఇది. ఈ సినిమాలోని ఎలిమెంట్స్ అందరిని సర్ప్రైజ్ చేస్తాయి. నా కెరీర్లో మరో ఉత్తమ చిత్రంగా మిగిలిపోతుందనే నమ్మకం ఉంది. విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నా. అదొక అద్భుతమైన కథ. కెరీర్ ఆరంభంలోనే ప్రతిభావంతులైన దర్శకులతో పనిచేయడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నా’ అని చెప్పింది.