Trikala Song | ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ వంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్లకు అద్భుతమైన సంగీతాన్ని అందించి, నేషనల్ అవార్డును గెలుచుకున్న సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్. ప్రస్తుతం ఆయన మైథలాజికల్ జానర్లో తెరకెక్కుతున్న ‘త్రికాల’ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. మణి తెల్లగూటి దర్శకత్వంలో శ్రద్ధా దాస్, మాస్టర్ మహేంద్రన్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న ఈ చిత్రం నుండి తాజాగా ‘యాలో ఈ గుబులే ఎలో’ అనే పాటను విడుదల చేశారు.
ఈ పాటలో హర్షవర్ధన్ రామేశ్వర్ తనదైన ట్రేడ్‌మార్క్ ఇంటెన్సిటీని, మెలడీలోని డెప్త్‌ను అద్భుతంగా బ్యాలెన్స్ చేశారు. ప్రతి బీట్లోనూ ఆయన మ్యూజిక్ ట్రీట్ స్పష్టంగా కనిపిస్తోంది. ఇక టాలెంటెడ్ సింగర్ అనురాగ్ కులకర్ణి తన గాత్రంతో ఈ పాటకి ప్రాణం పోశారు. భావోద్వేగాలను హృదయానికి హత్తుకునేలా పాడటంలో దిట్ట అయిన అనురాగ్, ఈ లవ్ మెలోడీని మరో స్థాయికి తీసుకెళ్లారు. రాకేందు మౌళి అందించిన సాహిత్యం ఎంతో క్యాచీగా, వినగానే నోటికి వచ్చేలా ఉన్నాయి.
ప్రముఖ కొరియోగ్రాఫర్ సుచిత్ర చంద్రబోస్ ఈ పాటకి కంపోజ్ చేసిన మూమెంట్స్ సాంగ్‌కు ఒక ప్రత్యేకమైన వైబ్‌ను తీసుకొచ్చాయి. ఇప్పటికే విడుదలైన ‘త్రికాల’ ట్రైలర్‌కు సోషల్ మీడియాలో భారీ రెస్పాన్స్ వచ్చింది. విజువల్స్ మరియు కంటెంట్ పరంగా ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా, ఒక్క ట్రైలర్‌తోనే నార్త్ ఇండియాలో ఈ సినిమా బిజినెస్ క్లోజ్ అవ్వడం విశేషం. ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్స్‌లో ‘త్రికాల’ మీద భారీ డిమాండ్ ఏర్పడింది. రిత్విక్ వేట్షా సమర్పణలో రాధిక, శ్రీనివాస్ నిర్మాతలుగా, శ్రీ సాయిదీప్ చాట్లా మరియు వెంకట్ రమేష్ దాడి సహ నిర్మాతలుగా ఈ చిత్రం రూపొందుతోంది.
నటీనటులు: శ్రద్ధా దాస్, మాస్టర్ మహేంద్రన్, అజయ్, సాహితి అవంచ, ఆమని, ప్రభాకర్, అంబటి అర్జున్, రౌడీ రోహిణి, తనికెళ్ల భరణి, సాయి దీనా తదితరులు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ‘త్రికాల’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.
దర్శకత్వం & ఎడిటింగ్: మణి తెల్లగూటి
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్
బీజీఎం: షాజిత్ హుమాయున్
సినిమాటోగ్రఫీ: పవన్ చెన్నా
పీఆర్వో: తేజస్వి సజ్జా