శ్రద్ధాదాస్, అజయ్, మాస్టర్ మహేంద్రన్ ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్న చిత్రం ‘త్రికాల’. ‘స్క్రిప్ట్ ఆఫ్ గాడ్’ ఉపశీర్షిక. మణి తెల్లగూటి దర్శకుడు. రాధికా శ్రీనివాస్ నిర్మాత. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను అగ్ర నిర్మాత దిల్‌రాజు ఆవిష్కరించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘హారర్ కథాంశమిది. కుమారి ఖండం అనే పురాణంలోని మూలకథను తీసుకొని ఆధునిక హంగులు మేళవించి ఈ సినిమాను తెరకెక్కించాం. శ్రద్ధాదాస్ పాత్ర ప్రధానాకార్షణగా నిలుస్తుంది. అబ్బురపరిచే గ్రాఫిక్స్‌తో సరికొత్త సినిమాటిక్ అనుభూతినందిస్తుంది’ అన్నారు. తనికెళ్ల భరణి, ఆమని, అర్జున్ అంబటి, ఐశ్వర్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, దర్శకత్వం: మణి తెల్లగూటి.