Tribanadhari Barbarik | టాలీవుడ్ డైరెక్టర్ మారుతి (Maruthi) సమర్పకుడిగా వ్యవహరించిన ప్రాజెక్ట్ త్రిబాణధారి బార్బరిక్ (Tribanadhari Barbarik). సత్యరాజ్ లీడ్ రోల్ రోల్లో నటించిన ఈ చిత్రానికి మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో వశిష్ఠ ఎన్ సింహా, సంచి రాయ్ ప్రధాన పాత్రలు పోషించారు.
మైథలాజికల్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు రాగా.. థియేటర్లలో అంతంగా ఇంప్రెస్ చేయలేకపోయింది. ఇక థియేటర్లలో నష్టాలను మిగిల్చిన ఈ చిత్రం ఓటీటీలో తన లక్‌ను పరీక్షించుకునేందుకు రెడీ అయింది. ఆరు వారాల థ్రియాట్రికల్ రిలీజ్ తర్వాత స్తుతం ఈ మూవీ రెండు పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫాంలలో స్ట్రీమింగ్ అవుతోంది. సన్ నెక్ట్స్‌లో తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుండగా.. అమెజాన్ ప్రైం వీడియోలొ తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
మరి త్రిబాణధారి బార్బరిక్ ఓటీటీలో ఎలాంటి రియాక్షన్ రాబట్టుకుంటుందనేది చూడాలి. ఈ చిత్రాన్ని వానరా సెల్యూలాయిడ్ బ్యానర్‌పై విజయ్‌పాల్ రెడ్డి ఆడిదల నిర్మించారు. ఎవరు తాతా ఇతను..? అని చిన్నారి అడుగగా.. ప్రపంచం గుర్తించని గొప్ప యోధుడమ్మా.. భీష్ముడా తాతా..? హహ కాదమ్మా.. అంటూ సాగే డైలాగ్స్‌తో మాధవా.. వెయ్యేనుగుల బలశాలి భీముడికి మనవడిని. ఘటోత్కచుడుకు కుమారుడిని అంటూ బార్బరిక్ పాత్రను ఎలివేట్ చేసే ఇంట్రడక్షన్ వీడియో సినిమాపై క్యూరియాసిటీ పెంచినా ప్రేక్షకులను అంతగా థియేటర్లకు రప్పించలేకపోయింది.
#TribanadhariBarbarik (Telugu)
Now streaming on Primevideo in Telugu, Tamil, Kannada & Hindi 🍿!!
In Sunnxt – Telugu & Tamil 🍿!!#OTT_Trackers pic.twitter.com/sbcFekHgDU
— OTT Trackers (@OTT_Trackers) October 10, 2025
NTR | ‘వార్ 2’ ఫ్లాప్‌తో ఎన్టీఆర్ హిందీ కెరీర్ ముగిసింది?.. కమల్ ఆర్ ఖాన్ షాకింగ్ కామెంట్స్!
Deepika Padukone | పనిగంటల వివాదం.. తొలిసారి స్పందించిన దీపికా పదుకొణే