సత్యరాజ్, ఉదయభాను, వశిష్టసింహా, క్రాంతికిరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘త్రిబాణధారి బార్బరిక్’ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మోహన్‌శ్రీవత్స దర్శకత్వంలో విజయ్‌పాల్ రెడ్డి అడిదల ఈ చిత్రాన్ని నిర్మించారు. సోషియో, పౌరాణిక అంశాల కలబోతగా సస్పెన్స్ థ్రిల్లర్‌గా సందేశాత్మక కథాంశంతో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా మహిళా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుండటంతో నిర్మాతలు ఓ ఆఫర్‌ను ప్రకటించారు.
సెప్టెంబర్ 7న గ్రాండ్ పేరెంట్స్ డేను పురస్కరించుకొని ఈ నెల 30, 31న ప్రదర్శించే సాయంత్రం ఆటకు వెళ్లే నలుగురు కుటుంబ సభ్యుల్లో ఇద్దరు గ్రాండ్ పేరెంట్స్‌కు (తాత, అమ్మమ్మ, నానమ్మ) ఉచితంగా సినిమా ప్రవేశం కల్పిస్తామని నిర్మాతలు తెలిపారు. తాత, మనవరాలి చుట్టూ నడిచే కథాంశమిది కాబట్టి ఈ ఆఫర్‌ను ప్రకటిస్తున్నామని మేకర్స్ తెలిపారు.