Trendsetter| అప్పటిదాకా ఉన్న ట్రాక్‌ని ఉన్నట్టుండి కొత్త ఒరవడిలో తీసుకెళ్లే వారిని ట్రెండ్ సెట్టర్ అంటాము. హీరోలు కొత్త స్టైల్స్‌ని తీసుకురావడం, వాటితో ఆ స్టైల్ ట్రెండ్ కావడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ముందుగా టాలీవుడ్ ట్రెండ్ సెట్టర్ అంటే పవన్ కళ్యాణ్ పేరు చెబుతాము. ఆయన వాకింగ్ స్టైల్, మేనరిజం ప్రేక్షకులకి బాగా కిక్కిస్తుంది. ఖుషీ సినిమాలో పవన్ కళ్యాణ్ ధరించిన హుడీ ట్రెండ్ సెట్టర్‌గా మారింది. ఆ సినిమా తర్వాతనే చాలా మంది హుడీస్ ధరించడం మొదలు పెట్టారు. ఇక ఆ తర్వాత మహేష్ బాబు సరికొత్త ట్రెండ్ తీసుకొచ్చాడు. పోకిరి సినిమాలో షర్ట్ మీద షర్ట్ ధరించి కొత్త ట్రెండ్ పరిచయం చేశాడు. ఈ సినిమా తర్వాతనే అందరు అలాంటి షర్ట్లు వేయడం మొదలు పెట్టారు.
ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దేశ ముదురు సినిమాతో సిక్స్ ప్యాక్ పరిచయం చేశాడు. ఈ చిత్రం తర్వాత అందరు కూడా సిక్స్ ప్యాక్ ట్రై చేశారు. టాలీవుడ్లో సిక్స్ ప్యాక్ పరిచయం చేసిన తొలి హీరో కూడా అల్లు అర్జున్. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నాయక్ సినిమాతో కొత్త టీ షర్ట్‌ని పరిచయం చేశాడు. ఈ టీ షర్ట్ కూడా చాలా ఫేమస్ అయింది. ఇక ప్రభాస్ మిర్చి సినిమాలో ఫార్మల్ వేర్ ధరించగా, అది ప్రతి ఒక్కరికి చాలా నచ్చేసింది. మిర్చి తర్వాత ఫార్మల్ లుక్ లో కనిపించేందుకు చాలా మంది ట్రై చేశారు. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సినిమాలో డిఫరెంట్ హెయిర్ స్టైల్ ట్రై చేశాడు. ఇందులో ఎన్టీఆర్ చాలా కొత్తగా కనిపించి అందరి దృష్టిని ఆకర్షించాడు.
ఎన్టీఆర్ లుక్ అప్పట్లో చాలా ఫేమస్ కాగా, దీనిని చాలా మంది ట్రై చేశారు. ఇలా చాలా మంది హీరోలు కూడా కొత్త ట్రెండ్‌ని పరిచయం చేస్తూ ఎప్పటికప్పుడు అందరి దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు హీరోల స్టైల్ మాత్రమే కాదు వారి బాడీ లాంగ్వేజ్ కూడా ట్రెండ్ సెట్టర్‌గా మారుతుంది. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ మేనరిజం చాలా ఫేమస్ అయింది. తగ్గేదే లే అని ఆయన ఇచ్చిన పోజులు, అలానే వాకింగ్ స్టైల్ ప్రతి ఒక్కటి కూడా జనాలకి పిచ్చి పిచ్చిగా నచ్చేశాయి. రాజకీయ నాయకులు, క్రికెటర్స్ కూడా వాటిని ఇమిటేట్ చేస్తూ పుష్ప సినిమా ప్రమోషన్ లో సగభాగం అయ్యారు.