స్నేహం గొప్పదనాన్ని తెలియజేస్తూ ఎల్.ఓ.ఎల్. ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మించిన చిత్రం ‘ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడు’. ఇంద్ర, కోమల్ నాయర్, దీపు, స్వాతిశర్మ, ఇమ్రాన్, శీతల్ భట్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.
ప్రస్తుతం ఈ సినిమా నుంచి ‘నా కల’.. పాటను సంగీత దర్శకుడు ఘంటాడి కృష్ణ చేతుల మీదుగా చిత్ర యూనిట్ బుధవారం విడుదల చేసింది. సీనియర్ నటీనటులతోపాటు కొత్తవారు కూడా ఈ సినిమాలో నటించారని నిర్మాతలు తెలిపారు. కొత్త ప్రదేశాల్లో షూట్ చేశామని, చిత్రీకరణ పూర్తి కావస్తోందని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రవణ్ భరద్వాజ్, నిర్మాతలు: చంద్ర ఎస్ చంద్ర, డాక్టర్ విజయ రమేశ్‌రెడ్డి, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: లక్ష్మణ్.జె.