ఇంద్ర, కోమల్ నాయర్, దీపు, స్వాతి శర్మ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడు’. చంద్రాస్ చంద్ర, డాక్టర్ విజయ రమేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. లక్ష్మణ్ జెల్ల దర్శకుడు. ఈ చిత్ర లోగోను ఎఫ్డీసీ ఛైర్మన్ అనిల్ కుర్మాచలం విడుదల చేశారు. దర్శకుడు లక్ష్మణ్ జెల్ల మాట్లాడుతూ…‘ప్రేమలో విడిపోతుంటారు కానీ స్నేహంలో బ్రేకప్స్ తక్కువ. మన జీవితంలో స్నేహానికి విలువ ఇవ్వాలని చెప్పే చిత్రమిది. ఎంటర్టైన్మెంట్తో పాటు ఎమోషన్ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం’ అన్నారు.