Sampradayini Suppini Suddapoosani | టాలీవుడ్ సీనియర్ నటీనటులు శివాజీ, లయ చాలా కాలం తర్వాత జంటగా నటించిన క్రైమ్ కామెడీ చిత్రం ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ (Sampradayini Suppini Suddapoosani). సుధీర్ శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లకు రాకుండా నేరుగా డిజిటల్ వేదికగా విడుదలవుతోంది. అయితే ఈ సినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ఈటీవీ విన్ దక్కించుకోగా.. ఈ సినిమాను ఫిబ్రవరి 12 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా మూవీ నుంచి ట్రైలర్ను విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ చూస్తుంటే పంచాయితీ సెక్రటరీ అయిన శ్రీరామ్ నీతి, నిజాయితీ అంటూ బ్రతుకుతుంటాడు. అయితే అతడి జీవితంలోకి అనుకోకుండా వచ్చిన సంఘటనలు ఏంటి.. అతడిని పోలీసులు, రౌడీలు ఎందుకు వెతుకుతుంటారు అనేది ఈ సినిమా కథ. క్రైమ్ కామెడీగా ఈ చిత్రం రాబోతుంది. ఒకప్పుడు వెండితెరపై సూపర్ హిట్ జోడీగా పేరు తెచ్చుకున్న శివాజీ, లయ ఇందులో మళ్లీ జంటగా నటిస్తుండటంతో సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.
What’s your genuine opinion on the #SampradayiniSuppiniSuddapoosani trailer? #Sivaji #laya pic.twitter.com/ESE7WvxsMP
— CHITRAMBHALARE (@chitrambhalareI) February 7, 2026