Director Meher ramesh Sister | టాలీవుడ్ దర్శకుడు మెహర్ రమేష్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. అతడి సోదరి మాదాసు సత్యవతి ఈ రోజు హైదరాబాద్లో తుదిశ్వాస విడిచింది. దీంతో టాలీవుడ్ ప్రముఖులు ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా సత్యవతి మృతిపట్ల తన సంతాపాన్ని తెలియజేశారు. సత్యవతి మరణ వార్త తనను ఎంతగానో కలచివేసిందని, ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.
దర్శకుడు మెహర్ రమేశ్ సోదరి శ్రీమతి మాదాసు సత్యవతి గారు ఈరోజు హైదరాబాద్లో తుదిశ్వాస విడిచారని తెలిసి ఎంతో బాధపడ్డాను. శ్రీమతి సత్యవతి గారి ఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. వారి కుటుంబం విజయవాడలోని మాచవరం ప్రాంతంలో నివసించేది. చదువుకునే రోజుల్లో వేసవి సెలవులు వచ్చినప్పుడు వారి ఇంటికి వెళ్లేవాళ్లం. రమేష్, సత్యవతి గారు మరియు కుటుంబంలోని ఇతర సభ్యులతో కలిసి ఎంతో ఆనందంగా సమయం గడిపిన జ్ఞాపకాలు ఉన్నాయి. శ్రీమతి సత్యవతి గారి కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాను.
దర్శకులు శ్రీ @MeherRamesh గారి సోదరి శ్రీమతి మాదాసు సత్యవతి గారి మరణవార్త తీవ్ర బాధాకరం. వారి పవిత్రాత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
– @PawanKalyan pic.twitter.com/QjShqIyp6z
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) March 27, 2025