Yash | ‘కేజీఎఫ్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత కన్నడ స్టార్ నటుడు యష్ చేస్తున్న చిత్రం ‘టాక్సిక్’ (Toxic). యాశ్ 19గా తెరకెక్కనున్న ఈ సినిమాకు జాతీయ అవార్డు గ్రహీత గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తుండగా.. కేవీన్ఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం మార్చి 19 2026లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడబోతున్నట్లు వార్తలు వచ్చాయి. సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుండడంతో విడుదల తేదీ మారబోతుందని టాక్ వచ్చింది. అయితే ఈ రూమర్స్‌పై తాజాగా చిత్రబృందం స్పందిస్తూ.. విడుదల తేదీలో మార్పులు లేవంటూ ప్రకటించింది. చెప్పిన డేట్ ప్రకారమే వచ్చే ఏడాది మార్చి 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. కియార అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు అక్షయ్ ఒబెరాయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నాడు. ఈ చిత్రం కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.
140 days to go…
His Untamed Presence,
Is Your Existential Crisis.#ToxicTheMovie releasing worldwide on 19-03-2026 https://t.co/9RC1D6xLyn— KVN Productions (@KvnProductions) October 30, 2025