Toxic | కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం “టాక్సిక్” (Toxic) పై అంచనాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ‘కేజీఎఫ్’ సిరీస్‌తో యష్ క్రేజ్ దేశవ్యాప్తంగా ఆకాశాన్ని తాకిన నేపథ్యంలో, ఆయన నుంచి వచ్చే ప్రతి సినిమా అప్డేట్ అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. ఇదే క్రమంలో ఇప్పుడు “టాక్సిక్” మూవీపై మేకర్స్ ఒక్కో అప్డేట్తో హైప్‌ను మరింత పెంచుతున్నారు. ప్రముఖ దర్శకురాలు జీతూ జోసెఫ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం సాలిడ్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపొందుతోంది. ఈ మూవీలో యష్ సరసన పలువురు స్టార్ హీరోయిన్లు నటిస్తుండటంతో, క్యాస్టింగ్ నుంచే సినిమాపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విడుదలైన చిన్న చిన్న అప్డేట్స్ సినిమాకు మంచి బజ్ తీసుకొచ్చాయి.
ఇక ఇప్పుడు అందరూ ఎదురుచూస్తున్న అసలు సిసలు బ్లాస్ట్‌కు మేకర్స్ సిద్ధమయ్యారు. జనవరి 8న యష్ పుట్టినరోజు సందర్భంగా ‘టాక్సిక్’ నుంచి బిగ్ అప్డేట్ విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు తాజాగా విడుదల చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోస్టర్లో యష్ లుక్‌ను పూర్తిగా రివీల్ చేయకుండా ఆసక్తిని రెట్టింపు చేశారు. మేకర్స్ ఇచ్చిన సమాచారం ప్రకారం, రేపు ఉదయం 10 గంటల 10 నిమిషాలకు ఆ బిగ్ అప్డేట్ను రిలీజ్ చేయనున్నారు. అది టీజరా, ఫస్ట్ లుక్ మోషన్ పోస్టరా, లేక యష్ పవర్ఫుల్ క్యారెక్టర్ ఇంట్రడక్షనా అన్నది ఇంకా సస్పెన్స్‌గా మారింది.
గతంలో యష్ బర్త్‌డే కానుకగా ‘కేజీయఫ్’ సినిమాల నుంచి వచ్చిన అప్డేట్స్ ఇండస్ట్రీని షేక్ చేసిన విషయం తెలిసిందే. ఆ లెవల్ సెన్సేషన్‌ను ఈసారి “టాక్సిక్” నుంచి వచ్చే ట్రీట్ బీట్ చేస్తుందా లేదా అన్నది అభిమానుల్లో పెద్ద చర్చగా మారింది. మొత్తానికి యష్ బర్త్‌డే సందర్భంగా రాబోయే ఈ బిగ్ అప్డేట్తో ‘టాక్సిక్’ మూవీ మరోసారి నేషనల్ లెవల్లో హాట్ టాపిక్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. అభిమానులు మాత్రం కౌంట్‌డౌన్ మొదలుపెట్టి, రేపటి బ్లాస్ట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 🔥