Toxic Movie | కేజీఎఫ్ చాప్టర్ 1, 2 సినిమాలతో బ్లాక్ బస్టర్లు అందుకుని స్టార్ హీరోగా మారిపోయాడు కన్నడ నటుడు యష్. అయితే ఈ సినిమా తర్వాత యష్ టాక్సిక్ అనే క్రేజీ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించిన విషయం తెలిసిందే. ‘ఎ ఫెయిరీ టెల్ ఫర్ గ్రోన్ అప్స్’ అనేది ఈ సినిమా ఉపశీర్షిక. నేషనల్ అవార్డు విన్నర్ మలయాళ దర్శకురాలు గీతూమోహన్ దాస్ ఈ సినిమాకు దర్వకత్వం వహిస్తుండగా.. కేవీఎన్ బ్యానర్ ఈ సినిమాను నిర్మిస్తుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం సమ్మర్ కానుకగా ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే నేడు యష్(YAsh Birthday Peek) పుట్టినరోజు సందర్భంగా మూవీ నుంచి స్పెషల్ గ్లింప్స్ వదిలారు మేకర్స్.
టాక్సిక్ బర్త్‌డే పీక్ (Toxic Birthday Peek) అంటూ వదిలిన ఈ వీడియోలో యష్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. సిగార్ కాల్చుకుంటూ యష్ కాసినోలోకి రాయల్‌గా ఎంట్రీ ఇస్తూ ఉండడం గూస్బంప్స్ తెప్పించేలా ఉంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోను మీరు కూడా చూసేయండి. మరోవైపు ఈ సినిమాను కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు మేకర్స్.