Tourist Family | తమిళంలో చిన్నా సినిమాగా విడుదలై ప్రశంసలు అందుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద క్లాసిక్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన టూరిస్ట్ ఫ్యామిలీ ఓటీటీలోకి రాబోతుంది. నటులు శశికుమార్, సిమ్రాన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం టూరిస్ట్ ఫ్యామిలీ(Tourist Family). నటులు యోగి బాబు, మిథున్ జై శంకర్, కమలేష్ జెగన్, ఎం.ఎస్. భాస్కర్, రమేష్ తిలక్, భగవతి పెరుమాళ్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించగా.. అభిషన్ జీవింత్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం మే 01న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్‌ను అందుకుంది. ముఖ్యంగా ఈ సినిమా చూసిన ప్రేక్షకులు చాలా బాగుందని ప్రశంసించారు. తలైవర్ రజనీకాంత్‌తో పాటు నటుడు శివకార్తికేయన్, ధనుష్, ఎస్.ఎస్ రాజమౌళి, సూర్య, నాని సినిమాపై ప్రశంసలు కురిపించారు. అయితే థియేటర్లో సూపర్ హిట్ అందుకున్న ఈ చిత్రం తాజాగా ఓటీటీలోకి రాబోతుంది. ప్రముఖ ఓటీటీ వేదిక జియో హాట్‌స్టార్‌లో ఈ సినిమా జూన్ 02 నుంచి తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతుంది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం కారణంగా ఒక తమిళ కుటుంబం తమ స్వస్థలాన్ని విడిచిపెట్టి భారతదేశానికి శరణార్థులు(refugee)గా వస్తారు. అనంతరం వారు చెన్నైలో కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ప్రయత్నిస్తారు. కానీ వాళ్లు ఎవరు అనేది చెప్పకుండా దాచిపెట్టాల్సి వస్తుంది. అలా దాచిపెడుతూ ఉండగా అనుకోకుండా రామేశ్వరం దగ్గర ఒక బాంబ్ బ్లాస్ట్ సంఘటన జరుగుతుంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేయడం మొదలుపెడతారు. అయితే ఈ కేసుకి వీరికి సంబంధంమేంటి.. శ్రీలంక నుంచి వచ్చిన ఈ ఫ్యామిలీకి ఎదురైన సమస్యలేమిటి అనేది ఈ సినిమా కథ.
#TouristFamily Steaming on Hotstar From June 2nd ❤️🥹 pic.twitter.com/axuITgNWYH
— Ayyappan (@Ayyappan_1504) May 28, 2025