 
                                                            Abishan Jeevinth | ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ (Tourist Family) చిత్రంతో దర్శకుడిగా తొలి అడుగులోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అభిషన్ జీవింత్ (Abishan Jeevinth).. తాజాగా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఈరోజు ఉదయం తన ప్రియురాలు అక్కీలతో కలిసి ఏడడగులు వేశాడు.
‘టూరిస్ట్ ఫ్యామిలీ’ ప్రీ-రిలీజ్ వేడుకలో అభిషన్ తన ప్రియురాలు అక్కీలపై ప్రేమను వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అక్టోబర్ 31న నన్ను పెళ్లి చేసుకుంటావా? అంటూ ప్రపోజ్ చేసి అందరిని షాక్‌కి గురిచేశాడు. అయితే చెప్పిన డేట్ ప్రకారమే నేడు అక్కీలను వివాహాం చేసుకున్నాడు అభిషన్. ఈ జంటకి పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరోవైపు ఈ యువ దర్శకుడికి ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ చిత్ర నిర్మాత మాగేశ్ రాజ్ పాసిలియన్ (Magesh Raj Pasilian) ఒక అద్భుతమైన బహుమతి ఇచ్చారు. తమ తొలి చిత్రానికి మెగా విజయాన్ని అందించినందుకు కృతజ్ఞతగా ఆయన అభిషన్‌కు లగ్జరీ బీఎండబ్ల్యూ (BMW) కారును వెడ్డింగ్ గిఫ్ట్‌గా అందించారు.
దర్శకుడిగా మెప్పించిన అభిషన్ ఇప్పుడు నటుడిగా మెప్పించేందుకు సిద్ధమవుతున్నారు. మలయాళ నటి అనస్వర రాజన్‌తో కలిసి హీరోగా నటిస్తున్న తన తదుపరి చిత్రం షూటింగ్ కూడా పూర్తయింది. రజనీకాంత్ కుమార్తె సౌందర్య రజనీకాంత్ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
“என்னை கல்யாணம் பண்ணிப்பியா?” – Cute Proposal from Tourist Family Director Abishan Jeevinth #TouristFamily | #Sasikumar | #Simran | #AbishanJeevinth pic.twitter.com/0VfFoBYhrp
— Pttvprime (@pttvprime) April 30, 2025
#TouristFamily director #Abishan ties the knot ♥️✨
At the pre-release event, he proposed to his girlfriend Akkila and announced their wedding for Oct 31 — and he kept his word! 💍❤️ pic.twitter.com/mAxHLpBVEN
— Mohan Babu (@mohanbabuavp) October 31, 2025
 
                            